పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే..‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. 1.మత్స్య పురాణము: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు.., మానవులు ఆచరించదగిన ధర్మాలు..,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. 2.మార్కండేయ పురాణము: ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి. 3.భాగవత పురాణము: ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్...