దశావతారాలు: యుగాలు నాలుగు, సత్య లేదా, కృత యుగం, త్రేత యుగం, ద్వాపర యుగం, కలి యుగం. సత్య లేదా కృత యుగంలో అవతారాలు మత్స్య, కుర్మ, వరాహ, నరసింహ త్రేత యుగంలో అవతారాలు వామన, పరశురామ, రాముడు ద్వాపర యుగం శ్రీ కృష్ణ, బుద్ధ చివరకు కలియుగం, కల్కి కానీ ఇంకా అవతరించలేదు. విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ. ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు. హరివంశమునందు నారాయణ, విష్ణు, వరాహ, నారసింహ, వామన, దత్తాత్రేయ, జామదగ్న్య, రామ, కృష్ణ, కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది. ఇందులో మత్స్య, కూర్మ, బుద్ధ, బలరామావతారాలు లేవు. మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు. మత్స్య పురాణంలో ధర్మ, నరసింహ, వామనావతారములు సంభూత్యవతారములని, దత్తాత్రేయ, మాంధాతృ, పరశురామ, రామ, వేదవ్యాస, బుద్ధ, కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది. పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు. సాధుపరిరక్షణకొఱకు, దుష్టశిక్షణ కొరకు ఆయన ఎన్నో అవతారాలలో యుగయుగాన అవతరిస్తాడు. అలాంటి అవతారాలలో 21 ముఖ్య అవతారాలను ఏకవింశతి అవతారములు అంటారు. కానీ వాటిలో అతిముఖ్యమైన 10 అవతారాలను దశావతారాలు అంటారు. ఆ అవతారలు బట్టే విష్ణువు ఎక్కువ ప్రాచుర్యం పొందాడు. భగవద్గీతలో శ్రీకృష్ణుని సందేశం “యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్య తదాత్మానం సృజామ్యహమ్ పరిత్రాణాయ సాధూనామ్ వినాశాయ చ దుష్కృతామ్ ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే” అర్జునా! ధర్మమునకు హాని కలిగినప్పుడును, జన్మ కర్మ రహితుడనైనప్పటికిని, నన్ను నేను సృజించు కొందును. సత్పురుషులను పరిరక్షించుటకును, దుష్టులను రూపు మాపుటకును, ధర్మమును సుస్థిర మొనర్చుటకును నేను ప్రతి యుగమునందును అవతరించుచుందును. భగవద్గీత నాల్గవ అధ్యాయము - జ్ఙాన, కర్మ సన్యాస యోగముల లోని ఈ రెండు శ్లోకములు ప్రసిద్ధములు. హిందూ విశ్వాసముల ప్రకారము లోకపాలకుడైన శ్రీ మహా విష్ణువు అనేక అవతారములు దాల్చును. అందు కొన్ని అంశావతారములు (ఉదా: వ్యాసుడు). కొన్ని పూర్ణావతారములు (ఉదా: నరసింహుడు). కొన్ని అర్చావతారములు (ఉదా: తిరుపతి వేంకటేశ్వరుడు). పూర్ణావతారములలో దశావతారములు ముఖ్యమైనవి. అవి:
1. మత్స్యావతారo:
మహా మీనంగా ప్రభవించి చాక్షుష మన్వంతరం అంత్యకాలంలో, వేదాల్ని దొంగలించిన సోమకుణ్ణి వధించి, సత్యవ్రతుణ్ణి మహీరూపమైన నావెనెక్కినంచి, సప్తర్షులతో , సకల బీజాల్ణీ , ఓషధుల్నీ కూడిన ఆ నావని తన మూపు మీద ధరించి రక్షించాడు. ఆ సత్యవ్రతుడే ఈ కల్పంలో వూవస్వత మనుపు.
2. కూర్మావతారo:
కూర్మాతవారము,లో క్షీరసాగరమథనవేళ ఒరిగిపోతున్న మందరాద్రిని తన వీపుపై నేర్పుగా నిలిపాడు
3. వరాహావతారo:
వరాహావతారము సత్య యుగంలోనే కనిపించినది. ఆ దేవదేవుడు పంది రూపంలో అవతరించాడు. హిరణ్యాక్షుడనే రాక్షసుడు ముల్లోకాలను అల్లకల్లోలం చేసి...భూమిని పాతాళంలో పడవేసి బ్రహం నిద్రిస్తుండగా వేదాలను తస్కరిస్తాడు. వరహావతతారంలో విష్ణుమూర్తి హిరణ్య్యాక్షుడిని సంహరించి...భూమిని, వేదాలను రక్షిస్తాడు.
4. నృసింహావతారo
లేదా నరసింహావతారo:
నారసింహ రూపంలో మానవుడి తొలి దశ కనిపిస్తుంది. ఇక్కడ మనిషి ఇంకా పరిపూర్ణ రూపం పొందలేదు. తన భక్తుడైన ప్రహ్లాదుడిని కాపాడేందుకు నారసింహావతారంలో దిగివచ్చిన శ్రీమహా విష్ణువు హిరణ్య కశ్యపుడిని సంహరిస్తాడు.
5. వామనావతారo:
వామనావావతారంతో
బలిని మూడడుగులడిగి, ముల్లోకాల్నీ ఆక్రమించాడు. అంటే శ్రీ మహావిష్ణువు మరుగుజ్జు రూపంలో వచ్చిన వామనుడు. రెండడుగులతో అండపిండ బ్రహ్మాండాల్ని ఆక్రమించి మూడో పాదంతో బలి చక్రవర్తిని పాతాళానికి పంపుతాడు . ఈ అవతారంలో భగవంతుడు మానవ రూపంలో కనిపిస్తాడు. మానవలు మొదట మరుగుజ్జులుగా ఉన్నారనే విషయం ఇక్కడ మనకు తెలుస్తోంది .
6. పరశురామావతారo:
కుపితభావంతో, బ్రాహ్మణ ద్రోహులైన రాజుల్ని ఇరవయ్యొక్కసార్లు వధించి భూమిని క్షత్రియశూన్యం గావించాడు. మనషి రూపంలో ఉన్నా...అనాలోచితంగా, ఆవేశపూరితంగా ప్రవర్థించడం కనిపిస్తుంది. అంటే నాగరికతకు పూర్వపు జీవులకు ఈ అవతారం ఒక ఉదహరణగా చెప్పుకోవచ్చు,
7. రామావతారo:
శ్రీరాముడై, దేవకార్యార్థమై రాజత్వాన్ని పొంది, సముద్ర నిగ్రహనాది పరాక్రమాల్ని ఆచరించాడు. ఇక్కడ మనిషి సమాజంలో ధర్మం కోసం జీవించడం, తనకన్నా సమాజానికి ఎక్కువ ప్రాముఖ్యతనివ్వడం కనిపిస్తుంది. రామావాతరాం పరిపూర్ణ మానవుడికి ప్రతీకగా నిలుస్తుంది . మానవ జీవనం ఎలా సాగాలో ఆచరించి చూపిన రాముడు ఆదర్శపురుషుడయ్యాడు .
8. కృష్ణావతారo:
బలరాముడి సోదరుడిగా శ్రీక్రుష్ణుడు జన్మిస్తాడు - భూమి భారన్ని తగ్గించాడు. ధర్మ సంస్థాపన కోసం ధరించిన ఈ అవతారంలో అర్జునుడికి జ్ఝానబోధ చేసి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజంయం సాధిసంచేందుకు ఆయన రథసారిధిగా నిలిచాడు శ్రీక్రుష్ణడు . ఇక్కడ మనిషి సమాజంలో ఎలా జీవించాలో తెలుసుకున్నాడని పురాణాలు చెబుతున్నాయి.
9. బుద్దావతారo:
బుద్ధుడు విష్ణువు యొక్క అవతారమని ప్రతీతి. ఉత్తర భారత సాంప్రదాయం ప్రకారం బుద్ధుడు అవతారమైతే, దక్షిణ భారత సాంప్రదాయం ప్రకారం బలరాముడు విష్ణువు అవతారంగా పరిగణిస్తారు. కలియుగాదిలో రాక్షససమ్మోహనం కోసం, కీకటదేశంలో (మధ్యగయా ప్రాంతంలో) జినసుతుడై, బుద్దుడనే పేర ప్రకాశిస్తాడు.
10. కల్కీ అవతారము:
చివరగా, కలియుగ, కృటయుగ సంధిలో రాజులు చోరులుగా మారి సంచరిస్తుంటే విష్ణుయశుడనే విప్రునికి కల్కి అనే పేర ఉద్భవిస్తాడు ...సర్వమ్లేచ్ఛ సంహారంగావిస్తాడు ధర్మ సంస్థాపనకు, సజ్జన సంరక్షణ, దుర్జన సంహారం కోసం, ప్రతీ యుగంలో తాను అవతరిస్తానని సాక్షాత్తూ ఆ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. ఈ అవతారలన్నీ అందుకు ప్రతీకలే.
Comments
Post a Comment