Skip to main content

Posts

Showing posts from May, 2022

అష్టాదశ పురాణాలు (Astaadasha puraanaalu)

పురాణాలు కల్పితాలు కావు. పురాణము అంటే..‘పూర్వకాలంలో ఇలా జరిగింది’ అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యద్వర్తమాన ద్రష్ట అయిన వేదవ్యాసుడు ఈ పురాణాల కర్త. సృష్టి ఆరంభం నుంచి జరిగిన, జరుగుతున్న, జరగబోవు చరిత్రలను వ్యాసభగవానుడు పదునెనిమిది పురాణాలుగా విభజించి మన జాతికి అంకితం చేసాడు.ఈ పురాణాలు ఏమేమి తెలుపుతాయో వివరంగా తెలుసుకుందాం. 1.మత్స్య పురాణము: శ్రీమహావిష్ణువు మత్స్యావతారం ధరించినప్పుడు ఈ పురాణాన్ని మనువుకు బోధించాడు. ఇందులో కార్తకేయ, యయాతి, సావిత్రుల చరిత్రలు.., మానవులు ఆచరించదగిన ధర్మాలు..,వారణాసి, ప్రయాగాది పుణ్యక్షేత్రాల మాహాత్మ్యాలు వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 14,000 శ్లోకాలు ఉన్నాయి. 2.మార్కండేయ పురాణము: ఈ పురాణం మార్కండేయమహర్షి చేత చెప్పబడింది. ఇందులో శివ, విష్ణువుల., ఇంద్ర, అగ్ని, సూర్యుల మాహాత్మ్యములు, దుర్గా సప్తశతి (దేవీ మాహాత్య్యము) చండీ, శతచండీ, సహస్రచండీ హోమాల విధానము వివరంగా చెప్పబడ్డాయి. ఇందులో 9,000 శ్లోకాలు ఉన్నాయి. 3.భాగవత పురాణము: ఈ పురాణాన్ని వేదవ్యాసుడు తన కమారుడైన శుకమహర్షికి బోధించచగా., ఆ శుకమహర్షి దానిని పరీక్షిత్

Astaadasha Puraanaalu By Dr. S. Vijay Kumar

Vedas and Upanishads By Dr. S. Vijay Kumar

Veda Vyas

వేదాలు - ఉపనిషత్తులు (VEDAS AND UPANISHADS)

వేదం అనగా 'జ్ఞానం' అని అర్ధం. కృష్ణద్వైపాయుడుగా పిలువబడే వ్యాసుడు, వేదాలను విభజించడం వల్ల వేద వ్యాసుడయ్యాడు. వేదాలతో పాటు మహాభారతం, మహాభాగవతంతో పాటు అష్టాదశపురాణాలు రచించాడు. వేదాలు నాలుగు: 1. ఋగ్వేదము 2. యజుర్వేదము 3. సామవేదము 4. అధర్వణవేదము. వేదాలకు (1). శ్రుతి, (2). అనుశ్రవం, (3). త్రయి, (4). సమమ్నాయము, (5). నిగమము, (6). ఆమ్నాయము, (7). స్వాధ్యాయం, (8). ఆగమం, (9). నిగమం అని తొమ్మిది పేర్లున్నాయి. 1. శ్రుతి - గురువు ఉచ్చరించినదాన్ని విని అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ నేర్చుకుంటాడు. 2. అనుశ్రవం - గురువు ఉచ్చరించినదాన్ని సరిగా తిరిగి అదేవిధముగా శిష్యుడు ఉచ్చరిస్తూ ఉంటాడు. 3. త్రయి - ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదములను కలిపి "త్రయి" అని పేరు. 4. సమమ్నాయము - ఎల్లప్పుడూ అభ్యసింపబడునవి. 5. నిగమము - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. యాస్కుడు నిగమము అని వీటిని వ్యవహరించాడు. 6. ఆమ్నాయము - ఆవృత్తి లేదా మననం ద్వారా నేర్చుకోబడే విద్య. 7. స్వాధ్యాయం - స్వాధ్యాయం అంటే—స్వ అధ్యయనం అంటే మనల్ని మనం విశ్లేషించుకోవడం 8. ఆగమం - భగవంతుని నిశ్వాస రూపములో బయలు పడేవి. 9. నిగమం - యాస్క