కేంద్ర బడ్జెట్ 2025 – 2026 - ఒక పరిశీలన -Dr. ఎస్ విజయ్ కుమార్ బడ్జెట్ అంటే ఆదాయ వేయాల పట్టిక నిజానికి మనమందరం బడ్జెట్లను తయారు చేసుకుంటాం. నెలసరి ఆదాయంపై ఆధారపడే వారైతే నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే దానిపై ఖర్చు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా తన ఆదాయ వ్యయల పట్టికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే, నెలకొకసారివ్యక్తి లాగా కాకుండా ప్రభుత్వం తన ఆదాయ వ్యయల పట్టికను ప్రతి సంవత్సరం రూపొందించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం 112 వ నిబంధన ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం పొందే వరకు దీనిని ఆర్థిక బిల్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే బడ్జెట్ గా పిలుస్తారు. వాస్తవానికి బడ్జెట్ అనే మాట రాజ్యాంగంలో లేదు. ఇది వ్యవహారం లో వచ్చిందే. కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్సభలో ప...