కేంద్ర బడ్జెట్ 2025 – 2026 - ఒక పరిశీలన
-Dr. ఎస్ విజయ్ కుమార్
బడ్జెట్ అంటే ఆదాయ వేయాల పట్టిక నిజానికి మనమందరం బడ్జెట్లను తయారు చేసుకుంటాం. నెలసరి ఆదాయంపై ఆధారపడే వారైతే నెలకు ఎంత ఆదాయం వస్తుంది అనే దానిపై ఖర్చు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం కూడా తన ఆదాయ వ్యయల పట్టికను రూపొందించుకోవాల్సి ఉంటుంది. అయితే, నెలకొకసారివ్యక్తి లాగా కాకుండా ప్రభుత్వం తన ఆదాయ వ్యయల పట్టికను ప్రతి సంవత్సరం రూపొందించుకోవాల్సి ఉంటుంది. రాజ్యాంగం 112 వ నిబంధన ప్రకారం ప్రభుత్వం ప్రతి సంవత్సరం పార్లమెంటుకు బడ్జెట్ సమర్పించాల్సి ఉంటుంది. పార్లమెంట్ ఆమోదం పొందే వరకు దీనిని ఆర్థిక బిల్లుగా వ్యవహరిస్తారు. రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతనే బడ్జెట్ గా పిలుస్తారు. వాస్తవానికి బడ్జెట్ అనే మాట రాజ్యాంగంలో లేదు. ఇది వ్యవహారం లో వచ్చిందే.
కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారమన్ లోక్సభలో ప్రవేశపెట్టారు. మొత్తం 50,65,345 కోట్లతో బడ్జెట్ను ప్రవేశపెట్టారు. వ్యవసాయ0, మౌలిక సదుపాయాలు, విద్య, వైద్య ఆరోగ్య రంగాలకు నిధులు, కొనుగోలు శక్తి పెంచడానికి పన్నుల చెల్లింపుల్లో సంస్కరణలు, వేతనజీవులకు ఊరట, ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు సేవలు గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపు, ఎగుమతులపై స్పెషల్ ఫోకస్, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు, దేశీయంగా తయారీ పరిశ్రమలకు మద్దతు, పట్టణాల అభివృద్ధికి, పేదలు, చిన్న వ్యాపారాలకు, వేతన జీవులకు ఆదాయం పన్నుల స్లాబ్ సడలింపు, అలాగే రక్షణ శాఖకు అధికంగా నిధులు కేటాయించడం, వృద్ధి రేటును వేగంగా పెంచేందుకు చర్యలు, పెట్టుబడుల పెరుగుదల ద్వారా 2047 నాటికి "వికసిత భారత్" లక్ష్యం మొదలైనవి ముఖ్యాంశాలు. ఏఏ రంగాలకు ఎంత మేరకు బడ్జెట్లో నిధులు కేటాయించారో చూద్దాం.
రక్షణకు రూ. 4,91,732 కోట్లు, గ్రామీణాభివృద్ది రూ. 2,66,817 కోట్లు, హోం రూ. 2,33,211 కోట్లు, వ్యవసాయ0, అనుబంధ రంగానికి రూ. 1,71,437 కోట్లు, విద్యకు రూ. 1,28,650 కోట్లు, ఆరోగ్యానికి రూ. 98,311 కోట్లు, పట్టణాభివృద్ది రూ. 96,777 కోట్లు, ఐటి, టెలికం రూ. 95,298 కోట్లు, విద్యుత్ రూ. 81,174 కోట్లు, వాణిజ్య, పరిశ్రమలకురూ. 65,553 కోట్లు, సామాజిక సంక్షేమం రూ. 60,052కోట్లు, వైజ్ఞానికి విభాగాలకు రూ. 5,679 కోట్లు కేటాయించారు.
కేంద్రానికి వచ్చే ఆదాయం: ఆదాయపన్ను నుంచి 22 శాతం, కేంద్ర ఎక్సైజ్ నుంచి 5 శాతం, జిఎస్టి, ఇతర పన్నుల నుంచి 18 శాతం, కార్పొరేషన్ పన్ను ద్వారా 17 శాతం, కస్టమ్స్ ద్వారా 4 శాతం, అప్పులతో కాని క్యాపిటల్ రిసిప్ట్స్ ద్వారా 1 శాతం, పన్నేతర ఆదాయం 9 శాతం, అప్పులు, ఇతర మార్గాల ద్వారా 24 శాతం ఆదాయం సమకూరుతుంది.
కేంద్ర ఖర్చులు: వడ్డీ చెల్లింపులకు 20 శాతం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు 16 శాతం, కీలక సబ్సిడీలకు 6 శాతం, రక్షణ రంగానికి 8 శాతం, రాష్ట్రాలకు పన్నులు, డ్యూటీల ద్వారా చెల్లింపుల్లో 22 శాతం, ఫైనాన్స్ కమిషన్, ఇతర బదిలీల ద్వారా 8 శాతం, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలకు 8 శాతం, ఇతర ఖర్చులకు 8 శాతం, పెన్షన్స్లకు 4 శాతం. ఇక వివరాల్లోకి వెళ్ళితే,
బడ్జెట్లో మధ్య తరగతిని దృష్టి లో పెట్టుకొని ఆదాయ పన్ను12 లక్షల వరకు మినహాయించారు. స్టాండర్డ్ డిడక్షన్ ను 50 వేల నుంచి 75 వేలకు పెంచారు. అయితే, ఆదాయం 12 లక్షల 75 వేలు దాటితే మాత్రం కొత్త ఆదాయ పన్నుల స్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 0 – 4 లక్షల వరకు ఆదాయ పన్ను కట్టనవసరం లేదు. 4 లక్షల నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, 12 నుంచి 16 లక్షల వరకు 15%, 16 నుంచి 20 లక్షల వరకు 20%, 20 నుంచి రూ.24 లక్షల వరకు 25%, 24 లక్షలు దాటితే 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సీనియర్ సిటిజన్లకు TDS (Tax Deduction at Source), TCS (Tax Collection at Source) మినహాయింపు 50 వేల నుంచి ఒక లక్షలకు పెంచారు. రెండో ఇంటిని స్వంతంగా కలిగి ఉన్నవారికి అద్దె ఆదాయపరిమితిని 2 లక్షల 40 వేల నుంచి రూ.6 లక్షలకు పెంచారు. మరింత సరళతరంగా కొత్త ఆదాయ పన్ను చట్టం బిల్లు ప్రవేశపెడతారు.
ఇక వ్యవసాయ రంగానికి వస్తే, వంద జిల్లాలను ఎంపిక చేసి వ్యవసాయంలో అధునూతన పద్ధతులను అమలు చేస్తారు. రైతుల నుంచి నేరుగా పప్పు ధాన్యలు సేకరణ, కొత్త నాణ్యమైన విత్తనాల అభివృద్ధికి ప్రత్యేక మిషన్ ప్రారంభం. కిసాన్ క్రెడిట్ కార్డ్ పరిమితి 3 లక్షల నుంచి 5 లక్షలకు పెంచడం ద్వారా రూ.7.7 కోట్ల మంది రైతులు, మత్స్యకారులు, పాడి రైతులకు మేలు జరగనుంది. వీటితో పాటుగా ఎక్కువ దిగుబడి ఇచ్చే, చీడ పీడలు, వాతవారణ విపత్తులను తట్టుకునే వంగడాలను అభివృద్ధి చేసేందుకు పరిశోధన వ్యవస్థను ఏర్పాటు చేయడం, కొత్తగా 100కిపైగా వంగడాలను అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వంట నూనె గింజల జాతీయ కమిషన్ అమలు చేస్తామన్నారు. బడ్జెట్లో వ్యవసాయం, అనుబంధ రంగాలకు మొత్తంగా రూ.1.45 లక్షల కోట్లు కేటాయించడం గమనార్హం. తక్కువ ఉత్పాదకత, పంటల సాంద్రత తక్కువగా ఉన్న వంద జిల్లాల కోసం పీఎం ధన ధాన్య కృషి యోజన తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. పీఎం కిసాన్ పథకానికి రూ. 63,500 కోట్లు కేటాయించారు. పప్పు ధాన్యాల ఉత్పత్తికి స్వయం సమృద్ధి పథకం. కంది, మినుములు, మసూర్ పప్పు కొనుగోలు, పండ్లు, కూరగాయల ఉత్పత్తికి కొత్త పథకం. కంది, మినప, ఎర్ర కందుల దిగుబడి పెంచేందుకు 1000 కోట్లతో ఆరేళ్ల మిషన్ చేపడుతున్నట్లు చెప్పారు. హార్టికల్చర్ రంగంలో ఉత్పాదకతను పెంచి పండ్లు, కూరగాయల సాగుతో రైతులకు మెరుగైన ఆదాయం వచ్చేలా 500 కోట్లతో ప్రత్యేక కార్యక్రమం అమలు చేయనున్నారు. దేశంలో వెనుకబడి జిల్లాల్లో వ్యవసాయానికి ప్రోత్సాహం. గోదాములు, నీటి పారుదల, రుణ సదుపాయాల కల్పన. ఈ పథకం ద్వారా కోటి 70 లక్షలమంది గ్రామీణ రైతులకు రైతులకు లబ్ధి చేకూరనుంది. భూరికార్డుల డిజిటలైజేషన్కు అధిక ప్రాధాన్యం మొదలైనవి.
పారిశ్రామిక రంగం: "Make in India" కుప్రోత్సాహం – మేకిన్ ఇండియా కోసం జాతీయ స్థాయి ప్రణాళిక రూపొందిస్తున్నట్లు చెప్పారు. ముడి సరుకు ఉత్పత్తులకు విధించే పన్నుల్లో సడలింపు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు ప్రాధాన్యతనిస్తూ 10 కోట్ల వరకు రుణాలు ఇవ్వడమే కాక, వాటికోసం మొదటి సంవత్సరం 10 లక్షల క్రెడిట్ కార్డులు జారీ చేస్తారు. స్టార్టప్లను ప్రోత్సహించడమే లక్ష్యం గా 20 కోట్ల వరకు రుణాలు ఇస్తారు. ఐదు లక్షల మంది ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఔత్సాహిక పారిశ్రామికవేత్తల కింద రూ.2 కోట్ల రుణాలు మంజూరు, తోలు పరిశ్రమలు, బొమ్మల రంగానికి బడ్జెట్లో చేయూతనిచ్చారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు 67 శాతం మేర కేటాయింపులుపెంచారు. కొత్తగా నేషనల్ ఇనిస్టిట్యూట్ఆఫ్ ఫుడ్ ప్రాసెసింగ్ సంస్థను ప్రారంభిస్తామన్నారు. బీమారంగంలో వంద శాతం ఎఫ్డీఐకు అవకాశం కల్పించారు. కస్టమ్స్ చట్టంలో 7 రకాల సుంకాలను తొలగించారు. గిగ్ వర్కర్లకు (తాత్కాలిక లేక పార్ట్ టైం విధులలో పనిచేసేవారు) ఆరోగ్య బీమా, గుర్తింపు కార్డులు. పీఎం స్వనిధి పథకం కింద రుణాల పెంపు. వర్తకులకు 30 వేల పరిమితితో యూపీఐ క్రెడిట్ కార్డులు మొదలైనవి.
పట్టణాభివృద్ధికి రూ. లక్ష కోట్లు, నగరాల అభివృద్ధి కోసం అర్బన్ ఛాలెంజ్ ఫండ్, లక్ష ఇళ్ల నిర్మాణం కోసం రూ.15వేల కోట్లు. జల్జీవన్ మిషన్ కింద దేశంలోని ఇంటింటికీ తాగునీరు. జల్జీవన్ మిషన్ గడువు 2028 వరకు పొడిగింపు. అందుకు రూ.67 వేల కోట్లు, మొత్తం తాగునీరు, పారిశుద్ధ్యానికి 74,226 కోట్లు కేటాయించారు.
విద్యుత్ రంగంలో సంస్కరణలు - అంతర్రాష్ట్ర విద్యుత్ పంపిణీ కోసం కొత్త ప్రణాళిక, వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకు అదనపు నిధులు, మూలధన వ్యయానికి వడ్డీ లేకుండా రూ.1.50 లక్షల కోట్లు రుణం, అణుఇంధన రంగంలో సంస్కరణలు. రాష్ట్రాల రుణాల పరిమితి జీఎస్డీపీలో 0.5 శాతం పెంపు, 2033 నాటికి ఐదు స్వదేశీ రియాక్టర్ల నిర్మాణం. వికసిత్ భారత్ కోసం న్యూక్లియర్ ఎనర్జీ మిషన్ మొదలైనవి.
విద్య, ఆరోగ్య రంగాలకు మెరుగైన నిధులు: IIT, AI & మెడికల్ విద్య –కొత్త AI కోర్సులు, IITల్లో సామర్థ్య విస్తరణ. IIT, IISc లో కొత్తగా 10వేల ఫెలోషిప్స్, అటల్ థింకరింగ్ ల్యాబ్స్ ద్వారా విద్యార్థుల్లో సృజనాత్మకతపెంపు,అంగన్వాడీ కేంద్రాలకు కొత్త హంగులతోపాటు బాలల ఆరోగ్యానికి కేంద్రం ప్రత్యేక నిధులు కేటాయింపు.ప్రభుత్వ పాఠశాలల్లోబ్రాడ్బ్యాండ్ సేవలకు బడ్జెట్లో ప్రాధాన్యమిచ్చారు. వచ్చే ఐదేళ్ల లోకొత్తగా 75,000 మెడికల్ సీట్ల పెంపు. దేశంలోని ప్రతి జిల్లాలో క్యాన్సర్ ఆస్పత్రులు, 200 ఈ-కేర్ క్యాన్సర్ కేంద్రాలు ఏర్పాటు. క్యాన్సర్ ఔషధాలు, సర్జికల్పరికరాలపై సుంకాలు తగ్గించారు. మెడికల్ టూరిజం ప్రోత్సాహానికి వీసా నిబంధనల సరళీకరణ. పీఎం జన్ ఆరోగ్య యోజన కింద ఆరోగ్య బీమా కొత్త పథకాల అమలుకు 10 లక్షల కోట్లు కేటాయించారు.
ఎనర్జీ, టెక్నాలజీ, రిసెర్చ్ రంగాలు: "న్యూక్లియర్ ఎనర్జీ మిషన్" – ప్రైవేట్ రంగ భాగస్వామ్యంతో అణు విద్యుత్ అభివృద్ధి. క్లీన్ ఎనర్జీ ప్రాజెక్టులు, స్మార్ట్ ఎనర్జీ సొల్యూషన్స్. గ్రీన్ ఎనర్జీ రంగానికి (Renewable Energy Example: Solar Energy) పెట్టుబడులు – గ్రీన్ హైడ్రోజన్ (Fuel Cell Vehicles) ప్రాజెక్టులకు ప్రోత్సాహం. అగ్రికల్చర్ & స్పేస్ టెక్నాలజీ –అభివృద్ధికి అధునాతన విధానాలు మొదలైనవి.
పర్యాటక రంగ విషయానికొస్తే దేశవ్యాప్తంగా 50 పర్యాటక ప్రాంతాల అభివృద్ధి చేస్తారు. ఇక ఏ వస్తువుల ధరలు పెరుగుతాయో, తగ్గుతాయో తెలుసుకుందాం.
ధరలు తగ్గేవి: LED టీవీలు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, తోలు వస్తువులు, నైలాన్ బట్టలు, ఫార్మా API – Active Pharmaceutical Ingredient (ఔషధాలలో వాడేది), చేనేత వస్త్రాలు, భారతదేశంలో తయారైన దుస్తులు, వైద్య పరికరాలు. క్యాన్సర్, మరియు అరుదైన వ్యాధులకు వాడే మందులు, 12 రకాల ఖనిజాలు మొదలైనవి.
ధరలు పెరిగేవి: దిగుమతి చేసుకునే మోటార్ సైకిల్స్, ప్రీమియం టీవీలు, ఫ్లాట్ ప్యానల్ డిస్ప్లేలు, అల్లిన బట్టలు మొదలైనవి.
మొత్తం మీద చూస్తే ఈ బడ్జెట్ వ్యవసాయ రంగానికి ఊతమిస్తూ, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచేలా కీలక నిర్ణయాలు తీసుకుంది. గ్రామీణ మరియు పట్టణ అభివృద్ధికి, మధ్య తరగతికి, పేదలకు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు, స్టార్టప్లకు ప్రయోజనం కలిగించేలా ఉంది. ఆదాయపు పన్నుల్లో భారీ మినహాయింపులు ఇవ్వడం ద్వారా వేతన జీవులకు ఊరట, పెట్టుబడులకు ప్రోత్సాహం ఇవ్వడం ద్వారా భవిష్యత్తులో దేశాభివృద్ధికి దోహదం చేస్తుందని చెప్పవచ్చు.
-Dr. S. Vijay Kumar In this article, I haved tried to explain the similarities and differences in the education system of India and USA. While, there are some similarities, there are also some significant differences too between the two education systems. It would be difficult for me to mention here in detail regarding all the ...
Comments
Post a Comment