Skip to main content

Posts

దశావతారాలు (Ten Incarnations of Lord Vishnu in Telugu)

  దశావతారాలు :  యుగాలు నాలుగు , సత్య లేదా , కృత యుగం , త్రేత యుగం , ద్వాపర యుగం , కలి యుగం . సత్య లేదా కృత యుగంలో అవతారాలు మత్స్య , కుర్మ , వరాహ , నరసింహ త్రేత యుగంలో అవతారాలు వామన , పరశురామ , రాముడు ద్వాపర యుగం శ్రీ కృష్ణ , బుద్ధ చివరకు కలియుగం , కల్కి కానీ ఇంకా అవతరించలేదు .  విష్ణువు అవతారాలలో పది ముఖ్యమైనవి అని చెప్పుచున్నప్పటికీ . ఆ పది అవతారాలు ఏవి అన్న అంశంపై ఏకాభిప్రాయం లేదు . హరివంశమునందు నారాయణ , విష్ణు , వరాహ , నారసింహ , వామన , దత్తాత్రేయ , జామదగ్న్య , రామ , కృష్ణ , కల్కి అవతారములు పది ప్రధానావతారాలని పేర్కొనబడింది . ఇందులో మత్స్య , కూర్మ , బుద్ధ , బలరామావతారాలు లేవు . మహాభారతమునందు శాంతిపర్వములో చెప్పబడిన అవతారములలో బుద్ధావతారం లేదు . మత్స్య పురాణంలో ధర్మ , నరసింహ , వామనావతారములు సంభూత్యవతారములని , దత్తాత్రేయ , మాంధాతృ , పరశురామ , రామ , వేదవ్యాస , బుద్ధ , కల్కి అవతారాలు మానుషావతారములని దశావతారాలను ఏకరువు పెట్టినది . పురాణాల ప్రకారం త్రిమూర్తులలో విష్ణువు లోకపాలకుడు . సాధుపరిరక్షణకొఱకు , దుష్టశిక్షణ క...